యస్‌ సంక్షోభం : పెట్టుబడుల వెల్లువ

ముంబై : యస్‌ బ్యాంకులో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో పునర్నిర్మాణ  చర్యల్ని ఆర్‌బీఐ, కేంద్రం వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఆర్‌బీఐ ప్రతిపాదించిన బ్యాంకు రికన్‌స్ట్రక్షన్‌ స్కీమునకు  కేంద్ర క్యాబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. యస్‌ బ్యాంకు షేరు రూ.10 చొప్పున 725 కోట్ల కొనుగోలు ద్వారా రూ. 7,250 కోట్ల పెట్టుబడులకు ఎస్‌బీఐ నిర్ణయించింది. అలాగే ప్రైవేటుబ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ  కూడా రూ. 1,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. 100 కోట్ల ఈక్విటీ షేర్లను షేరుకు  రూ. 10 చొప్పున కొనుగోలు చేయనుంది.   ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐపెట్టబడుల ప్రకటన తరువాత వరుసగా ప్రైవేటు   బ్యాంకులు యస్‌బ్యాంకు వాటాల కొనుగోలుకు క్యూ కట్టాయి. ఐసీఐసీఐ, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ,కోటక్‌ మహీంద్ర   బ్యాంకు బోర్డులు ఈపెట్టుబడులకు ఆమోదం తెలిపాయి.